ETV Bharat / state

Harish Rao on Job Notification : 'త్వరలోనే 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ' - కొత్తఅసిస్టెంట్‌ప్రొఫెసర్లకు నియామకపత్రాలు

Harish Rao Comments on Jobs Notification in Telangana : రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కొత్తగా నియామకమైన 1061మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్​లో నియామక పత్రాలు అందించారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని పేర్కొన్నారు.

Harishrao
Harishrao
author img

By

Published : May 22, 2023, 2:07 PM IST

Updated : May 22, 2023, 3:21 PM IST

Harish Rao Comments on Jobs Notification in Telangana : పేద ప్రజలకు న్యాణమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్రం ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను, ఆసుత్రులను ఏర్పాటు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హారీశ్‌రావు అన్నారు. పెరిగిన ఆసుత్రులకు అనుగుణంగా.. కొత్తగా నియామకమైన వేయి 61మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హైదరాబాద్​లో నియామక పత్రాలను అందించారు. ఒకే రోజు వేయి 61 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం అనేది వైద్య విద్య రంగంలోనే పెద్ద రికార్డుగా ఆయన పేర్కొన్నారు.

ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ కృషి చేయాలి : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకంలో అత్యంత పారదర్శకం పాటిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో ఒక లక్ష 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం... మరోసారి 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వబోతున్నామని.. అందులో భాగంగా ఇవాళ 1061 మంది డాక్టర్లకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నామని తెలిపారు. ఏళ్ల తరబడి పని చేసిన ఆయుష్‌ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో పేదలకు సేవలందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమైన ఉత్తర ప్రదేశ్‌ చివరి స్థానంలో ఉందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది వరకు మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అందరూ కృషి చేయాలని మంత్రి హరీశ్​రావు కోరారు.

'ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చాం. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాం. 1,331 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాం. 2014 నుంచి ఆరోగ్యశాఖలో 22,263 మంది నియమించాం. ఆరోగ్యశాఖలో మరో 2 నెలల్లో మరో 9,222 పోస్టులు భర్తీ చేయనున్నాం. ప్రభుత్వ వైద్య సేవల్లో మూడో స్థానంలో ఉన్నాం.'- హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

జూన్‌ నుంచి 134 రకాల వైద్య పరీక్షలు : టీ డయాగ్నోస్టిక్స్‌లో ప్రస్తుతం 54 రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసే ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభించబోతున్నమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో 20 ఏళ్లకు ఒక మెడికల్‌ కాలేజీ మాత్రమే తెలంగాణకు వచ్చిందని అన్నారు. తెలంగాణ వచ్చాక ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు 500 కోట్లు రూపాయలు ఖర్చు చేసి ఏడాదిలోనే 9 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని హరీశ్​రావు తెలిపారు.

ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్‌ కాలేజీలు: మంత్రి హరీశ్‌రావు

ఇవీ చదవండి:

Last Updated : May 22, 2023, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.