Gangula on paddy: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన పౌరసరఫరాలశాఖ వానాకాలం కొనుగోళ్లలో ఆల్‌టైం రికార్డు సృష్టించిందని ప్రకటించారు. కేంద్రం 40 లక్షల క్వింటాళ్ల బియ్యం కొనుగోలుకు మాత్రమే అనుమతించిన నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ఆ లక్ష్యం కూడా చేరుకుంటామని స్పష్టం చేశారు. దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరణపై అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఇదే విషయంపై సీఎం స్పష్టతివ్వాలని సమావేశంలో కోరతానని తెలిపారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి: మంత్రి గంగుల
minister gangula on maneru: వారంలో కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులకు టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. పనుల్లో పురోగతి, డిజైన్ల పరిశీలన క్షేత్రస్థాయి పనులపై నీటిపారుదల శాఖ, పర్యాటక శాఖ అధికారులు, సర్వే సంస్థల ప్రతినిధులతో హైదరాబాద్‌లో గంగుల సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని అధికారులు, సర్వే సంస్థల ప్రతినిధులు.. మంత్రికి వివరించారు. మానేరు రివర్ ఫ్రంట్లో ప్రధాన భాగాలకు చెందిన డీపీఆర్‌లపై అధికారులు వివరించారు. ప్రాజెక్టును క్షుణ్నంగా సమీక్షించిన మంత్రి గంగుల దాదాపు 4 కిలోమేటర్ల మేర చేపట్టనున్న రిటైనింగ్ వాల్, లోయర్, అప్పర్ ప్రామినాడ్లు, బ్యారేజీ బారేజీ డీపీఆర్ తుదిదశకు చేరకున్నందున టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇప్పటికే 410 కోట్లని ప్రభుత్వం కేటాయించిందని..ప్రపంచస్థాయి నిర్మాణాలతో రివర్‌ప్రంట్ రూపుదిద్దుకోబోతుందని చెప్పారు. ఈ నెలలోనే టెండర్లు పిలిచి వచ్చే నెల నుంచే పనులను ప్రారంభిస్తామని గంగుల తెలిపారు.