హైదరాబాద్ అమీర్‌పేటలో 50పడకల ఆసుపత్రిని ఏప్రిల్ 20లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషితో మూడేళ్లలోనే ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తికావచ్చిందని పేర్కొన్నారు. మంత్రి తలసానితో కలిసి ఆసుపత్రిని ఆయన సందర్శించారు. పనుల పురోగతి, ఇతర మౌలిక సదుపాలయాల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్