నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించాలన్న... సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... అధికారులను ఆదేశించారు. ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ మార్కెటింగ్ మిషన్-ఈజీఎమ్ఎమ్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష జరిపారు.
ఈజీఎమ్ఎమ్ ద్వారా ఇస్తున్న ఉపాధి శిక్షణ, ఉద్యోగావకాశాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన ద్వారా 2016-19 ప్రాజెక్టులో... 51 వేల మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి.. 36 వేలకుపైగా ఉద్యోగావకాశాలు కల్పించినట్లు ఎర్రబెల్లి తెలిపారు.
2019-22 ప్రాజెక్టులో భాగంగా... 90 వేల మంది యువతకి శిక్షణ ఇచ్చి.. కనీసం 63 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఇందుకోసం 57 ప్రైవేట్ సంస్థలను భాగస్వాముల్ని చేస్తూ 824 కోట్ల రూపాయలు బడ్జెట్‌గా నిర్ధారించినట్లు మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి : 'భారత్ బంద్'కు తెరాస మద్దతుపై కిషన్‌రెడ్డి ఫైర్