ETV Bharat / state

ERRABELLI : 'అర్హులందరికీ మూడు రోజుల్లో పింఛన్ అందాలి ' - తెలంగాణ వార్తలు

అర్హులందరికీ మూడు రోజుల్లోగా పింఛన్లు(PENSIONS) అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(ERRABELLI DAYAKAR RAO) ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అర్హులను గుర్తించాలని సూచించారు.

ERRABELLI dayakar rao review, review on aasara pensions
ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆసరా పింఛన్లపై సమీక్ష
author img

By

Published : Aug 9, 2021, 4:43 PM IST

ఆసరా పింఛన్ల(Aasara Pension) కనీస వయస్సును 57 ఏళ్లకు తగ్గించినందున అర్హులైన లబ్ధిదారులకు మూడు రోజుల్లోగా పింఛన్లు అందించాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(ERRABELLI DAYAKAR RAO) ఆదేశించారు. ఫించన్ల వయోపరిమితి తగ్గించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర కార్యక్రమాలపై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అర్హులను గుర్తించి, ప్రతి ఒక్కరికి మూడు రోజుల్లోగా పింఛన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు.

చర్యలు తీసుకోవాలి

గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలన్న మంత్రి... వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో హరితహారంలో(HARITHAHARAM) నాటిన మొక్కలు పూర్తిగా బతికేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో మండల, జిల్లా స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలని ఎర్రబెల్లి తెలిపారు.

రహదారులకు మరమ్మతులు

విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే పంపు మెకానిక్‌ల సమస్యల పరిష్కారం కోసం నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదార్ల మరమ్మతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం నివేదిక సమర్పించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. చిన్నపాటి మరమ్మతులను వెంటనే చేపట్టి వాహనాలు వెళ్లేందుకు అనుకూలంగా రోడ్లను తీర్చిదిద్దాలని తెలిపారు.

ఇదీ చదవండి: MLA RAJAIAH: ఆ ప్రచారం అవాస్తవం... తుదిశ్వాస వరకూ కేసీఆర్​తోనే నా పయనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.