TRS leaders fires on Central Government:విభజన చట్టంలో హామీలన్నీ అమలయ్యే వరకు కేంద్రంతో పోరాటం ఆపేదిలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. రవిచంద్రతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు, తెరాస నేతలు పాల్గొన్నారు. ఎంపీ రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయడం లేదని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
''పల్లెప్రగతికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు మన హక్కు. అవి కూడా ఆపేశారు. బండి సంజయ్ గారు పోరాటం చేస్తా.. అంటున్నారు. కేంద్రం మీద చేస్తారో.. ఎవరి మీదో చేస్తారో తెలియదు. రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వరు అని భాజపా ఎంపీలు అడగరు కాని.. తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రిని బదనాం చేస్తున్నారు. ఓ పక్క వడ్లు కొనమని చెప్పి.. వడ్లు కొంటే కావాలని రైస్ మిల్లర్లపై కేసులు పెడుతున్నారు. మళ్లీ వడ్లు కొంటలేరని బదనాం చేస్తున్నారు.'' - మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
'' తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మీద చిన్నచూపు చూస్తున్నారు. రాబోయే కాలంలో రాష్ట్రానికి రావాల్సిన దానిపై కచ్చితంగా పోరాడుతాం.'' - నామా నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభాపక్ష నేత
ఇవీ చదవండి: