ETV Bharat / state

వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి పెంచాలి : సింగరేణి రివ్యూలో భట్టి - Bhatti Vikaramarkha

Minister Bhatti review on Coal Production in Singareni : వేసవిలో విద్యుత్ కొరత తలెత్తకుండా బొగ్గు ఉత్పత్తి చేసి థర్మల్ పవర్ కేంద్రాలకు నిరంతరం సరఫరా చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి సంస్థ పనితీరుపై సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister Bhatti meeting with Singareni Officials
Minister Bhatti review on Coal Production in Singareni
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 8:14 PM IST

Minister Bhatti review on Coal Production in Singareni : రాబోయే ఎండాకాలంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేసి విద్యుత్కేంద్రాలకు అందించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikaramarkha) సింగరేణి అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమం, రక్షణను విస్మరించవద్దని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులు రూ. 81,516 కోట్లు : భట్టి విక్రమార్క

Minister Bhatti meeting with Singareni Officials : సింగరేణి సంస్థ పనితీరుపై సచివాలయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. సింగరేణి గనులు(Singareni), విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్, లక్ష్యాలతో పాటు సంస్థ ఆర్థిక స్థితిగతులు, కార్మిక సంక్షేమం తదితర అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నైనీ బొగ్గు బ్లాకులో ఉత్పత్తి ప్రారంభించేందుకు కేంద్రం, ఒడిశా ప్రభుత్వంతో చర్చించి ఆటంకాలను అధిగమించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తుందని చెప్పారు.

సింగరేణి ఫలితాల్లో ఐఎన్​టీయూసీ హవా - సత్తా చాటిన ఏఐటీయూసీ

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నందున ఈ విషయంలో సంస్థకు మేలు జరిగేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సింగరేణి అధికారులకు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సింగరేణి విస్తరణ కోసం బొగ్గు మైనింగ్‌తో పాటు ఇతర ఖనిజ అన్వేషణకు ప్రణాళికలున్నాయా అని ఉపముఖ్యమంత్రి ఆరా తీయగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసినట్లు అధికారులు వివరించారు.

కార్మికుల సంక్షేమం, రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సింగరేణి అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. కార్మికులకు వైద్యసదుపాయం, అలవెన్సులు, కారుణ్య నియామకాల ప్రక్రియ మెడికల్ బోర్డు పాత్ర, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Singareni Elections : మరోవైపు సింగరేణిలో నిర్వహించిన ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది. మొత్తంగా 11 రీజియన్‌లలో ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ, ఆరుచోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపుబావుటా ఎగురవేశాయి. ఆరేళ్లుగా అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉనికిని కోల్పోయింది. బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది.

విద్యుత్​రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం - అధికార విపక్షాల మధ్య "పవర్" వార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.