హైదరాబాద్ మెట్రో రెండో దశను విస్తరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం, బీహెచ్ఈఎల్ నుంచి మెహదీపట్నం వరకు మెట్రో రైలును విస్తరిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు నడుస్తాయన్నారు. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రైళ్లను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
ఎస్‌ఆర్‌డీపీ రెండు, మూడు దశల్లో మరిన్ని ప్రాంతాలతో పాటు... మెట్రో రైలు విస్తరణకు అవకాశం లేని ప్రాంతాల్లో ఎలివేటెడ్ బీఆర్‌టీఎస్ కూడా విస్తరిస్తామన్నారు.
ప్రాంతీయ బాహ్యవలయ రహదారి (రీజినల్ రింగ్‌రోడ్)ను నిర్మిస్తాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌ల నిర్మాణం చేపడతాం. నగరంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచుతాం. నగరంలో ఉన్న ఆర్టీసీ బస్సుల రూపురేఖలు మారుస్తాం. హైదరాబాద్‌ను జీరో కార్బన్ సిటీగా మార్చలన్నదే లక్ష్యం.
--- ముఖ్యమంత్రి కేసీఆర్
ఇదీ చూడండి: గృహవినియోగదారులకు ఉచితంగా నీటి సరఫరా: కేసీఆర్