ETV Bharat / state

మెట్రో రైలు నిర్మాణ ఒప్పందం మరో 6నెలలు పొడిగింపు

మెట్రో రైలు నిర్మాణ ఒప్పందాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఉన్న గడువు ముగియడంతో తాజాగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈనెలతో మెట్రో పనులన్నీ పూర్తవుతున్నా.. కొన్ని చిన్నచిన్న పనులు చక్కబెట్టాల్సి ఉండడంతో ఎల్.అండ్.టీ హైదరాబాద్ మెట్రో రైలుతో ఒప్పందాన్ని జూన్ 2020 నాటికి పొడిగించినట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు.

METRO CONSTRUCTION WORK EXTENSION IN HYDERABAD
మెట్రో రైలు నిర్మాణ ఒప్పందం మరో 6నెలలు పొడిగింపు
author img

By

Published : Jan 3, 2020, 7:50 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్​గా హైదరాబాద్ మెట్రో ఆవిర్భవించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.14 వేల 132 కోట్లు వెచ్చించారు. ఇందులో ఎల్.అండ్.టీ రూ.12 వేల 674 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఆస్తుల సేకరణ కోసం ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వం రూ.1,458 కోట్లు సర్దుబాటు వ్యయనిధిని ఏర్పాటుచేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును టెండర్లలో ఎల్.అండ్.టీ మెట్రో దక్కించుకుంది.

2012 జూన్​లో ఒప్పందం

మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల పనులను ఐదేళ్లలో పూర్తిచేస్తామని 2012 జూన్​లో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. 2012 జూలై 5న అపాయింటెడ్ డేగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 జూలై 4 నాటికి పనులన్నీ పూర్తిచేయాల్సి ఉండగా అలైన్ మెంట్ వివాదాలు, ఆస్తుల సేకరణలో జాప్యం, రైల్వేల అనుమతి తదితర కారణాలతో కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వేర్వేరు దశల్లో ఉండడం వల్ల ఎల్.అండ్.టీ మెట్రో అభ్యర్థన మేరకు అప్పట్లో సర్కారు నిర్మాణ పనుల పూర్తికి 2018 నవంబర్ వరకు ఒప్పందం పొడిగించింది.

మరో 6 నెలలు పొడిగింపు

అలైన్ మెంట్ వివాదం తేలకపోవడంతో పాతబస్తీలో మెట్రో పనులు మినహాయించింది. అప్పటికీ కేవలం 46 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. కీలకమైన జేబీఎస్, రాయదుర్గం మార్గంలో మెట్రో పనులు పూర్తికాకపోవడంతో పనుల పూర్తి గడువును సర్కారు మరోసారి 2019 డిసెంబర్ వరకు పొడిగించింది. 66కిలోమీటర్ల పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గంలో ట్రయల్ రన్స్ నడుస్తున్నాయి. ఈ రూట్​ను మున్సిపల్ ఎన్నికల అనంతరం ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని మరో ఆరునెలల గడువు పొడిగించిందని మెట్రో అధికారులు వెల్లడించారు.

మెట్రో రైలు నిర్మాణ ఒప్పందం మరో 6నెలలు పొడిగింపు

ఇవీ చూడండి: పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే 'ఇన్నోవేషన్​ యాత్ర'

TG_HYD_04_03_METRO_CONSTROCTION_WORK_EXTENTION_PKG_3182388 reporter : sripathi.srinivas ( ) మెట్రో రైలు నిర్మాణ ఒప్పందాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఉన్న గడువు ముగియడంతో తాజాగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈనెలతో మెట్రో పనులన్నీ పూర్తవుతున్నా..కొన్ని చిన్నచిన్న పనులు చక్కబెట్టాల్సి ఉండడంతో ఎల్.అండ్.టీ హైదరాబాద్ మెట్రో రైలుతో ఒప్పందాన్ని జూన్ 2020 నాటికి పొడిగించినట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు. Look టాప్ పాయింట్స్ : మూడు కారిడార్లలో 72 కి.మీ.లకు 66కి.మీ.ల పనులు పూర్తయ్యాయి. కారిడార్1లో 29 కి.మీ. మియాపూర్ నుంచి ఎల్.బీ.నగర్ వరకు అందుబాటులోకి వచ్చింది. కారిడార్2 లో 29 కి.మీ.లు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు అందుబాటులోకి వచ్చింది. కారిడార్3 10కి.మీ.లు జేబీఎస్ నుంచి ఎం.జీ.బీ.ఎస్ వరకు ఈనెలాఖరులో అందుబాటులోకి వస్తుంది. వాయిస్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ మెట్రో ప్రాజెక్ట్ గా హైదరాబాద్ మెట్రో ఆవిర్బవించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.14,132 కోట్లు వెచ్చించారు. ఇందులో ఎల్.అండ్.టీ వ్యయం రూ.12,674 కోట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఆస్తుల సేకరణ కోసం ఖర్చుచేసింది. కేంద్ర ప్రభుత్వం రూ.1,458 కోట్లు సర్ధుబాటు వ్యయనిధిని ఏర్పాటుచేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును టెండర్లలో ఎల్.అండ్.టీ మెట్రో దక్కించుకుంది. మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల పనులను ఐదేళ్లలో పూర్తిచేస్తామని 2012 జూన్ లో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. 2012 జూలై 5న అపాయింటెడ్ డేగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 జూలై 4 నాటికి పనులన్నీ పూర్తిచేయాల్సి ఉండగా అలైన్ మెంట్ వివాదాలు, ఆస్తుల సేకరణలో జాప్యం, రైల్వేల అనుమతి తదితర కారణాలతో కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగితా పనులు వేర్వేరు దశల్లో ఉండడంతో ఎల్.అండ్.టీ మెట్రో అభ్యర్థన మేరకు అప్పట్లో సర్కారు నిర్మాణ పనుల పూర్తికి 2018 నవంబర్ వరకు ఒప్పందం పొడిగించింది. అలైన్ మెంట్ వివాదం తేలకపోవడంతో పాతబస్తీలో మెట్రో పనులు మినహాయించింది. అప్పటికీ కేవలం 46 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. కీలకమైన జేబీఎస్, రాయదుర్గం మార్గంలో మెట్రో పనులు పూర్తికాకపోవడంతో పనుల పూర్తి గడువును సర్కారు మరోసారి 2019 డిసెంబర్ వరకు పొడిగించింది. 66కీలోమీటర్ల పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గంలో ట్రయల్ రన్స్ నడుస్తున్నాయి. ఈ రూట్ ను మున్సిపల్ ఎన్నికల అనంతరం ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని మరో ఆరునెలల గడువు పొడిగించిందని మెట్రో అధికారులు వెల్లడించారు. End..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.