హైదరాబాద్ హుమాయున్‌నగర్ పీఎస్ పరిధిలోని మెహిదీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరు యాచకులను టిప్పర్ ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : బోరబండలో చెలరేగిన మంటలు