ETV Bharat / state

'పరిశుభ్రతకు ఓ పది నిమిషాల సమయం కేటాయించండి' - జాతీయ డెంగీ దినోత్సవం వార్తలు

ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సూచించారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయం ఆవరణలోని పూలకుండీల్లో నిల్వ నీటిని తొలగించారు.

Mayor Vijayalakshmi participating in the National Dengue Day

author img

By

Published : May 16, 2021, 3:26 PM IST

మన ఇంటి నుంచే మొదలుపెడదాం నినాదంతో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ డెంగీ దినోత్సవాన్ని నిర్వహించారు. తన కార్యాలయం ఆవరణలో పూలకుండీల్లోని నిల్వ నీటిని తీసేశారు. అనంతరం జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న యాంటీ లార్వా ఆపరేషన్‌ను పరిశీలించారు.

Mayor Vijayalakshmi participating in the National Dengue Day
నిల్వ నీటిని తొలగిస్తున్న మేయర్‌

ఈ సందర్భంగా ఎన్‌బీటీనగర్ బస్తీలో ఆశా కార్యకర్తలతో కలిసి ఫీవర్ సర్వేను పరిశీలించారు. జ్వరం లక్షణాలున్న వారికి మందుల కిట్లను అందించారు. ప్రజలు తమ ఇళ్లలో నీటి నిల్వ ఉండకుండా.. ప్రతి ఆదివారం ఓ 10 నిమిషాల సమయం కేటాయించాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: నేడు కొన్ని జిల్లాల్లోనే తౌక్టే తుపాను ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.