ఒక మహిళ మరో మహిళను ప్రోత్సహించిన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. మహిళలు అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, అప్పయ్య సొసైటీలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రముఖ మహిళ వ్యాపారవేత్తలు నీలిమా, మాధవి ఏర్పాటు చేసిన స్పీన్ డ్రైవ్ ఇన్‌ను ఆమె ప్రారంభించారు.
మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారి కోసం ప్రత్యేకంగా ఒక స్పీన్ డ్రైవ్ ఇన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని మేయర్ విజయలక్ష్మి అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని నిర్వాహకురాలు నీలిమా తెలిపారు. వినూత్న పద్దతిలో ఆహారాన్ని భోజన ప్రియులకు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. 15 రోజులకు ఒకసారి గిరిజన మహిళలకు తమ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 100 రూపాయలు కొనుగోలు చేసిన వారికి కూపన్ అందిస్తామని... ప్రతి నెల లక్కీ డ్రా తీసి ఆకర్షణియమైన బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ వాడకుండ తగు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గతేడాది హైదరాబాద్ వరదలపై నీతి ఆయోగ్ నివేదిక