దేశంలో నివాసయోగ్యమైన ఉపాధి కార్యక్రమాల నిర్వహణపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమమైన నగరంగా నిలిచిందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హాలిడిఫై డాట్ కామ్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో బెస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణం అన్నారు. చారిత్రక గొప్పదనంతో పాటు మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి, ఆర్థిక ప్రగతిలో హైదరాబాద్ ఉత్తమ పర్యాటక నగరంగా స్థానాన్ని దక్కించుకుందనన్నారు.
నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్, జంక్షన్ల అభివృద్ధి, స్లిప్ రోడ్లు, లింక్‌రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నగరంలో వివిధ రంగాల్లో రూ. 50వేల కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో రూ. 30 వేల నుంచి రూ. 40వేల కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: 'అసెంబ్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేద్దాం'