సికింద్రాబాద్లోని మచ్చ బొల్లారం మార్కెట్ వద్ద వినియోగదారులకు, అభాగ్యులకు అల్వాల్ పోలీసులు మాస్కులు, శానిటైజర్లు అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అల్వాల్ ఇన్స్పెక్టర్ యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్కులను అందించి వారికి కరోనాపై అవగాహన కల్పించారు. అనవసరంగా బయట తిరగకుండా భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి : విద్యార్థులూ... మానసిక సమస్యలుంటే ఫోన్ చేయండి