ఓ వివాహిత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిలకలగూడ నామాలగుండులో నివాసముంటున్న ప్రభాకర్-మమతా దంపతులకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది వృత్తిరీత్యా కూరగాయల వ్యాపారం. అదే క్రమంలో మమతకు పక్కింటి వాచ్‌మన్ బంధువైన గణేష్‌తో పరిచయం ఏర్పడింది.
బజారుకు వెళ్లి..
మమత ప్రతిరోజూ కూరగాయలు అమ్మేందుకు బజారుకు వెళ్లేది. అది గమనించిన గణేష్ కూరగాయలు కొనడానికి ఆమె వద్దకు వచ్చేవాడు. కొన్నిరోజుల తర్వాత భర్తకు అనుమానం వచ్చింది. భార్య ఫోన్లో గణేష్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు గమనించాడు. ఆమెను మందలించాడు.
మందలింపు..
భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల.. వెంటనే ఆమె సోదరున్ని పిలిపించి విషయమంతా చెప్పాడు. మమతను మందలించి ఇంట్లోనే ఉండాలని చెప్పారు. అనంతరం అదే రోజు రాత్రి ఫోన్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నట్లు భర్త తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : నెక్లెస్‌రోడ్‌లో ఉత్సాహంగా 10కె రన్