ETV Bharat / state

Covid Effect: కళ తప్పిన ఫంక్షన్‌ హాళ్లు.. సందడి లేని ఈవెంట్‌ సంస్థలు - పెళ్లిళ్లపై కరోనా పంజా

శుభాకార్యాలు ఏవైనా ఇంటిల్లిపాదికి, బంధుమిత్రులకు ప్రత్యక్షంగా ఆనందాన్నిస్తుంది. పరోక్షంగా ఎంతోమందికి ఉపాధినిస్తుంది. కానీ కరోనా మహమ్మారి ఈ పరిస్థితిని తలకిందులు చేసింది. శుభకార్యాలపై ఆధారపడ్డవారి వ్యాపారం, ఉపాధిని కుప్పకూల్చేసింది. రాష్ట్రానికి చెందినవారే కాదు.. హైదరాబాద్‌లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వాళ్లూ పెద్దఎత్తున ఉపాధి కోల్పోయారు. వీరంతా బతుకుదెరువుకోసం దొరికిన పనల్లా చేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు.

marriages are being postponed due to covid
Covid Effect: కళ తప్పిన ఫంక్షన్‌ హాళ్లు.. సందడి లేని ఈవెంట్‌ సంస్థలు
author img

By

Published : Jun 14, 2021, 8:23 AM IST

హైదరాబాద్​లో పెళ్లిళ్ల సీజన్‌లో సుమారు తొమ్మిది వేల పెళ్లిళ్లు జరిగేవి. కరోనా రెండో దశ కారణంగా(Covid Effect) చాలామంది వేడుకలను వాయిదా వేసుకుంటే కొందరు మాత్రమే నిరాడంబరంగా చేసుకున్నారు. సుమారు 800 ఫంక్షన్‌ హాళ్లు వేడుకలు లేక వెలవెలబోతున్నాయి. ఇందులో కొన్ని కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రాలు(Isolation Centers)గా కూడా మారాయి. శుభ ముహూర్తాలున్నప్పుడు పెళ్లిళ్లే కాకుండా గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటివి కూడా పెద్దఎత్తున జరిగేవి. కానీ ఈ ఏడాది అంతా తారుమారైంది.

మే, జూన్‌ నెలల్లో మంచి ముహూర్తాలున్నా రెండో వేవ్‌ విజృంభణతో చాలామంది భయపడిపోయారు. దీనికి తోడు ప్రభుత్వ ఆంక్షలు(Covid Rules) కూడా ఉండడంతో ఎవరూ వేడుకల జోలికిపోలేదు. దాదాపు 80 శాతం కార్యక్రమాలను వాయిదా వేశారు. మిగిలిన 20 శాతం కూడా అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య నిర్వహిస్తున్నారు.ఈ రంగంపై ఆధారపడ్డ వారి ఆర్థిక స్థితి అస్తవ్యస్తమైంది.

రాష్ట్రంలో 30 వేల మంది పురోహితులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ద్వారా ఉపాధి పొందేవారు. ఇప్పుడు తొంభైశాతం మందికి ఉపాధి పూర్తిగా తగ్గిపోయిందంటూ రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘం ఐకాస కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అతిథులకు ప్లేట్లు, పండ్లు అందించే మహిళలు ఉపాధి లేక ఇళ్లలో పాచిపనులు చేసుకుంటున్నారు. బాయ్స్‌ ఊర్లలో వ్యవసాయ పనులు, నగరాల్లో కూరగాయలు అమ్ముకుంటున్నారు. 'ఏటా 200 వరకు పెళ్లిళ్లు, ఈవెంట్లకు సేవలు అందించేవాళ్లం. రూ.3 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడు దాదాపు 90శాతం వ్యాపారం కుప్పకూలింది. జూన్‌, జులైకి ఒక్క బుకింగ్‌ కూడా కాలేదు’ అని నగరంలోని ప్రముఖ సప్లయింగ్‌ కంపెనీ అధినేత నందికొండ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇలా వివాహానికి సంబంధించిన ప్రతి రంగంపై కరోనా చూపిన ప్రభావం తీవ్రంగా ఉంది. మళ్లీ ఆ కళకళలు తిరిగి ఎప్పుడొస్తాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

‘ఈ ఏడాది ముహూర్తాలు బాగా ఉండడంతో ఆర్థికంగా బాగానే ఉంటుందనుకున్నాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నెలాఖరు వరకు ముహూర్తాలు ఉన్నాయి. జులై 10 నుంచి ఆషాఢం మొదలవుతుంది. దీంతో శుభకార్యాలు ఆగిపోతాయి. ఇప్పటికే చాలా పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి.’

-జి.రాఘవేంద్ర శర్మ

ఆన్‌లైన్‌ సదస్సులతో

టీ, ఫార్మా, బీపీఓ కంపెనీలు, కేంద్రప్రభుత్వ సంస్థలు, రియాల్టీ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలరీత్యా వందలమందితో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేవి. ఇలాంటి సదస్సులకు సాంకేతికంగా, నిర్వహణపరంగా అవసరమైన ఏర్పాట్లు చేసేవారికి, భోజనాలు అందించేవారికి, ఏసీలు, లైటింగ్‌ అందించేవారికి ఉపాధి లభించేది. ఇప్పుడా కాన్ఫరెన్స్‌లు అన్నీ ఆన్‌లైన్‌ కావడంతో వీరి ఉపాధి ఘోరంగా దెబ్బతింది.

అడ్వాన్స్‌లు ఇచ్చి రద్దు చేసుకున్నారు

రోనా రెండో వేవ్‌ మొదలుకాక ముందు 28 వివాహాలకు వేదిక బుక్‌ చేసుకున్నారు. కేసులు పెరగడంతో 25 రద్దయిపోగా కేవలం మూడు పెళ్లి వేడుకలు మాత్రమే జరిగాయని శ్రీ కన్వెన్షన్ నిర్వాహకుడు శ్రీతేజ తెలిపారు. రద్దయినవాళ్లంతా అడ్వాన్సులు తిరిగిచ్చేయమని అడిగారని... లక్షల్లో వ్యాపార నష్టం వాటిల్లిందని వాపోయారు. దీనికి నిర్వహణ ఖర్చులు తోడయ్యాయి.

వడ్డీలు కట్టడానికే సరిపోతోంది

రోనాకు ముందు ఈవెంట్స్‌ వ్యాపారం బాగా సాగేందుకు మిత్రులందరం కలిసి ఓ కన్వెన్షన్‌ హాల్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. నా వంతుగా రూ.45లక్షలు ఇచ్చాను. కొద్ది రోజుల్లోనే లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు, ఇతర వేడుకలు వాయిదా పడ్డాయి. ఈ సీజన్‌ అయినా బాగుంటుందని అనుకున్న తరుణంలో మళ్లీ రెండో వేవ్‌ తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పులు చేసి డబ్బు కట్టాం. డబ్బు ఇస్తానని నిర్వాహకుడు చెప్పినా ఏడాదిన్నరగా వ్యక్తిగతంగా నెలకు రూ.40వేల చొప్పున వడ్డీ కడుతున్నాను.

- విజయ్‌, అన్వయ ఈవెంట్స్‌

రూ.40 లక్షల నష్టం

‘ఈ సీజన్‌లో మొత్తం 10 పెళ్లిళ్లకు అడ్వాన్సులు ఇచ్చారు. ఇందులో కేవలం రెండు మాత్రమే జరిగాయి. జరిగిన రెండింటిలోనూ 40 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సీజన్‌లో సుమారు రూ.40 లక్షల వ్యాపారం నష్టం జరిగింది. ఓ వేడుకకు సుమారు 70 మందికి ఉపాధి కల్పించేవాడిని. ఇప్పుడా పరిస్థితి లేదు’

- నర్సింహారావు, లక్ష్మీ క్యాటరర్స్‌.

ఇదీ చూడండి: Corona Effect : అనాథ చిన్నారులకు అండగా.. ఆపన్నహస్తాలుండగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.