Margadarsi 111th Branch opening in Peerzadiguda : ప్రజా విశ్వాసంలో తిరుగులేని సంస్థగా ప్రసిద్ధి గాంచిన మార్గదర్శి చిట్ ఫండ్స్ (Margadarshi Chit Funds) మరో మైలురాయిని అధిగమించింది. మార్గదర్శి 110 బ్రాంచీలు విజయవంతంగా సాగుతున్న తరుణంలో తాజాగా 111వది హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో అందుబాటులోకి వచ్చింది. ఉప్పల్-వరంగల్ జాతీయ రహదారిపై పిల్లర్ నంబరు 80 వద్ద ఏర్పాటు చేసిన కొత్త బ్రాంచిని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ శైలజా కిరణ్ ప్రారంభించారు.
'99 శాతం రికవరీ రేటు.. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తాం'
Margadarsi MD Sailaja Kiran opened New Branch in Hyderabad : ఈ కార్యక్రమంలో ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఈటీవీ భారత్ మేనేజింగ్ డైరెక్టర్ బృహతి కూడా పాల్గొన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లు హాజరయ్యారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన చందాదారులు మార్గదర్శి సంస్థతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
Margadarsi 110th Branch Opening in Karnataka : కర్ణాటకలోని హవేరీలో మార్గదర్శి 110వ బ్రాంచ్ ప్రారంభం
60 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతూ, ఏటా వృద్ధి సాధిస్తూ నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు దూరదృష్టితో ప్రారంభించిన మార్గదర్శి ఎక్కడ ఉంటే, అక్కడ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయని నిరూపితమైంది. ఇతర సంస్థల్లో పొదుపు చేసి నష్టాలు చవిచూసిన ఎన్నో కుటుంబాలు, 100 శాతం పారదర్శకతతో నడుస్తున్న మార్గదర్శిలో మదుపు చేసి ఆర్థిక లబ్ధిని పొందాయి. ఆయా కుటుంబాల్లోని రెండో తరం సైతం సంస్థలో కొత్త సభ్యులుగా మారుతుండటం విశేషం.
"మార్గదర్శిలో తప్పించి నేను ఎక్కడా చిట్ వేయను. నాకు నమ్మకమైనది మార్గదర్శి. చిట్ డబ్బులు ఎలా వసూలు చేస్తారో అలాగే చెల్లింపులు కూడా చేస్తారు. గత 30 సంవత్సరాలుగా మార్గదర్శికి చందాదారుడిగా ఉన్నాను." - నందగోపాల్, మార్గదర్శి చందాదారుడు
హైదరాబాద్ నగరంలో ఇది 21వ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్. అన్ని వర్గాల ప్రజల్లో పొదుపు సంస్కృతి, ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతున్న సంస్థ సుదీర్ఘ ప్రస్థానంలో మొత్తంగా చూస్తే 111వ శాఖ. మార్గదర్శి చిట్ ఫండ్స్ నాలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తూ ఏటా వృద్ధి సాధిస్తోంది. ఎంతో నిబద్ధతతో నడుస్తూ, సంక్షోభ సమయంలోనూ నిరంతరాయంగా సేవలు అందించామని ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్ (Margadarsi MD Sailaja Kiran) తెలిపారు. లక్షలాది కుటుంబాల దీవెనలు మార్గదర్శితో పెనవేసుకుని ఉన్న దృష్ట్యా, కోట్లాది మందికి మరో 100 ఏళ్లు సేవలు అందించాలన్న అభిలాష వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం త్వరలో కర్ణాటకలో రెండు, తెలంగాణలో ఇంకో శాఖ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శి సన్నాహాలు చేస్తోంది.
"ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షల మందికి సేవ చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇంత మంది మార్గదర్శిని కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. విశ్వసనీయతకు మారుపేరు మార్గదర్శి. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే. ఇది తప్పకుండా జరుగుతుంది." - సీహెచ్ శైలజా కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్
వినూత్న ఆలోచనలు, సరైన ప్రణాళికతోనే విజయాలు తథ్యం: శైలజా కిరణ్