దళితులకు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలాన్ని కొంతమంది అన్యాక్రాంతం చేసుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని మందాబాద్ వాసులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి రెవెన్యూ పరిధిలోని మందాబాద్కు సంబంధించిన సర్వే నంబరు 127 హరిజన బస్తీకి కేటాయించిన 3,525 గజాల స్థలం కబ్జాకు గురైంది.
ఆ స్థలంలో నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని దళితులకు అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు ఆ స్థలాన్ని పరిశీలించారు. స్థానికులకు అండగా ఉండి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దళితుల కోసం కేటాయించిన భూములను స్వప్రయోజనాల కోసం కబ్జా చేయడం సమంజసం కాదని అన్నారు. కోర్టు స్టే ఇచ్చినప్పటికీ నిర్మాణాలు చేపట్టడం సరికాదన్నారు. వెంటనే కంటోన్మెంట్ అధికారులు చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కేంద్రం భావిస్తే ఎన్నికలు వాయిదా వేయవచ్చు: తలసాని