తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పాక్షికంగా ఉందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్రెస్ టెస్ట్ ట్రీట్ విధానం ద్వారా వైరస్ నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ సూచించిన.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రజలు స్వచ్ఛందంగా చాలా నిబద్దతో నిబంధనలు పాటించిన.. కేసీఆర్ ఆదాయం కోసం వైన్ షాపులు ఓపెన్ చేయడం వల్ల లాక్ డౌన్ విఫలమైందన్నారు. కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో కమిషనర్ మమతకు ఎన్-95 మాస్కులు అందజేశారు.
విద్యా సంస్థల్లో ఫీజులు పెంచడానికి వీలు లేదని జీఓ విడుదల చేసిన రెండు రోజులకే మెడికల్ కళాశాల రుసుములు పెంచారు. కేసీఆర్ చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదు. ఓ ప్రముఖ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన గోప్యంగా ఉంచారు. కొవిడ్-19 సోకి చనిపోతే వారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదు. జర్నలిస్టులకు ఆరు నెలల పాటు రూ. పదివేల చొప్పున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని సహాయం చేయాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తాను.
-రేవంత్ రెడ్డి, మల్కాజి గిరి ఎంపీ
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..