రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి పాటుపడుతోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి... వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన రెండు అంబులెన్సులను ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధులకు రెండువేల రూపాయల పింఛన్ ఇస్తోందని.. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా ఇవ్వలేదని తెలిపారు.
ఇదీ చదవండిః 'కానిస్టేబుళ్ల నియామకాల్లో అవకతవకలు జరగలేదు'