Tollywood Drugs Case Updates Today : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మాదాపూర్ డ్రగ్స్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సినీనటుడు నవదీప్(Actor Navdeep) చరవాణిని స్వాధీనం చేసుకొని విశ్లేషించిన నార్కోటిక్ పోలీసులకు పెద్దగా ఆధారాలేవి లభించలేదు. మాదకద్రవ్యాల వాడకందారుగా నవదీప్‌ను ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు.. సెప్టెంబర్ 23వ తేదీన ప్రశ్నించారు. అనంతరం అతని చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
Actor Navdeep Updates Today : నవదీప్ తన ఫోన్లోని సమాచారం మొత్తం డిలీట్ చేసి ఇవ్వడంతో.. నార్కోటిక్ విభాగం పోలీసులు సాంకేతికతను ఉపయోగించి రిట్రైవ్ చేశారు. అందులోనూ పెద్దగా ఆధారాలేమీ దొరకలేదు. నవదీప్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ తక్కువ సందర్భాల్లో డ్రగ్స్ తీసుకున్నానని.. ప్రస్తుతం మానేశానని నార్కోటిక్ విభాగం పోలీసులకు తెలిపాడు. మాదక ద్రవ్యాల వాడకందారుగా నవదీప్‌ను చేర్చిన పోలీసులు.. నేరాభియోగ పత్రంలోనూ నిందితుడిగా చేర్చనున్నారు.
Tollywood Drugs Case Updates : ఇప్పటికే ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో సినీ రంగానికి చెందిన వాళ్లు కూడా ఉన్నారు. వైజాగ్‌కు చెందిన రాంచంద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వాట్సాప్ చాటింగ్‌లో నవదీప్‌ను గుర్తించారు. మరికొంత మంది నిందితులైన కలహర్ రెడ్డి, స్నాట్ పబ్ యజమాని సూర్య, టెర్రా కేఫ్ యజమాని అర్జున్‌లను సైతం నిందితులుగా చేర్చారు. వీళ్లను కూడా పిలిచి ప్రశ్నించారు.
స్నాట్ పబ్, టెర్రా కేఫ్‌లోనూ ప్రత్యేకంగా ఓ గది కేటాయించి అందులో మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రతి సోమవారం గుడిమాల్కాపూర్ పీఎస్‌కు.. నిందితులు వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా నిందితులుగా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేసిన నార్కోటిక్ విభాగం పోలీసులు.. ఆ ముగ్గురి నుంచే రాంచంద్, వెంకటరత్నారెడ్డి, బాలాజీ మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు నైజీరియన్లకు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారనే వివరాలను రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Hyderabad Drugs Case : ఈ ఏడాది సెప్టెంబరు 14న గుడి మల్కాపుర్ పోలీసులతో కలిసి నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో భాగంగా నవదీప్‌తో సంప్రదింపులు జరిపినట్లు తేలడంతో అతడినీ నిందితుడిగా చేర్చారు.
Drugs Seize in Hyderabad : రాయదుర్గంలో డ్రగ్స్ స్వాధీనం.. రాజమండ్రికి చెందిన ముఠా అరెస్ట్