ETV Bharat / state

Madhapur Drugs Case Update : మాదాపూర్​ డ్రగ్స్​ కేసు.. ఇద్దరు నైజీరియన్లు అరెస్టు.. రెండ్రోజుల్లో మరికొంత మందికి నోటీసులు - మాదాపూర్​ డ్రగ్స్​ కేసు ఎవరు నిందితులు

Madhapur Drugs Case Update in Hyderabad : మాదకద్రవ్యాల వ్యవహారంలో నార్కోటిక్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరమైంది. ఇటీవల మాదాపూర్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీకి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫైనాన్షియర్లు, నిర్మాతలు, నటుల లింకులు బయటపడడం కలకలం రేకెత్తించింది. పోలీసులు సేకరించిన ఆధారాలతో బెంగళూరులో డ్రగ్స్‌ కీలక సూత్రధారులైన నైజీరియన్ల(Main Accused Nigerians)ను అరెస్టు చేశారు. వారిని పోలీసు కస్టడీలో తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొంత మందిని విచారణకు.. నోటీసులు జారీ చేసేందుకు నార్కోటిక్‌ పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.

Actor Navdeep in Madhapur Drugs Case
Madhapur Drugs Case Latest News
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 10:09 AM IST

Madhapur Drugs Case మాదాపూర్​ డ్రగ్స్​ కేసు.. అదుపులో ఇద్దరు నైజీరియన్లు

Madhapur Drugs Case Update in Hyderabad : హైదరాబాద్​లోని మాదాపూర్ మాదకద్రవ్యాల కేసుపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులను విచారించారు. అయితే ఈ విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలతో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేసిన పోలీసులు రెండ్రోజుల్లో మరికొంత మందిని అదుపులోకి తీసుకోబోతున్నట్లు తెలిసింది.

Tollywood Drugs Case Update : టాలీవుడ్‌లో మరోసారి మత్తు కలకలం!.. నిందితుల్లో సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కుమారుడు

Hyderabad Drugs Case Update : మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కీలక నిందితులైన బెంగళూరుకు చెందిన నైజీరియన్లను కస్టడీలో తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల కాల్‌డేటా, చాటింగ్స్‌ వంటివి ముందుంచి వారిని ప్రశ్నిస్తున్నారు. తొలుత తమకు డ్రగ్స్‌ అంటే తెలియదని బుకాయించి.. ఆ తర్వాత ఆధారాలు చూపగానే వాస్తవాలు వివరిస్తున్నట్టు సమాచారం. సినీ నటుడు నవదీప్‌ పోలీసులు విచారించిన సమయంలో మాదకద్రవ్యాల గురించి తనకు తెలియదంటూ మాటమార్చారని.. పోలీసులు ఆధారాలు అతని ముందు ఉంచేసరికి ఏమీ మాట్లాడలేకపోయాడని తెలిసింది. ఈ కేసు విషయంలో మరోసారి తనని విచారించే అవకాశం ఉందని నార్కోటిక్​ పోలీసులు తెలిపారు.

Narcotic SP Sunitha on Madhapur Drugs Case : 'నవదీప్​ ఫోన్​ డేటా డిలీట్ చేశాడు.. రీట్రైవ్​ చేసి మళ్లీ విచారిస్తాం'

Tollywood Drugs Case Update : పోలీసు కస్టడీలో ఉన్న సినీ నిర్మాత.. కళ్ల ముందు ఆధారాలున్నా అమాయకుడినని బుకాయించబోయాడు. అయితే అతని ముందు కూడా ఆధారాలు ఉంచే సరికి విచారణకు సహకరిస్తానని తెలిపినట్టు సమాచారం. మరో వైపు ఈ వ్యవహారంలో మరికొంత మందిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కొందరికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. దీంతో మరిన్ని విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Madhapur Drugs Case Latest News : మాదకద్రవ్యాల కేసుల్లో విదేశీయులను విచారించడం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ఈ వ్యవహారంలో పట్టుబడుతున్న నైజీరియన్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. గంజాయి తీసుకోవడం తమ దేశంలో సర్వసాధరణమని ఎదురు తిరుగుతున్నారని తెలిసింది. దీంతో వారి నుంచి వాంగ్మూలం సేకరించడంలో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. అనువాదకుల ద్వారా వారి నుంచి వాంగ్మూలం సేకరిస్తున్నారు. విచారణ సమయంలో నైజీరియన్లు కేకలు వేస్తూ.. అరుస్తుండటంతో.. వారి నుంచి వాంగ్మూలం రాబట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. అన్నీ సమస్యలను అధిగమిస్తూ.. పోలీసులు అతి కష్టంమ్మీద వారి నుంచి వాంగ్మూలం సేకరిస్తున్నారు.

Madhapur Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తుతో 'మత్తు' వినియోగదార్లలో దడ

Madhapur Drugs Case Updates : నిత్యం వివాదాలకు కేరాఫ్​ అడ్రస్​ @ యాక్టర్ నవదీప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.