పెద్దలు పెళ్లికి నిరాకరించడం వల్ల ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ చైతన్యపురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు నల్లగొండ జిల్లా రంగారెడ్డిగుడాకు చెందిన వారిగా గుర్తించారు. చైతన్యపురిలో ఉంటున్న సందీప్ రెడ్డి, దామరచర్లలో ఉంటున్న త్రివేణిలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు వరుసకు బావా మరదలు. కుటుంబాల మధ్య గొడవులున్నా... వారి ప్రేమను కొనసాగించారు. పెళ్లి చేసుకుంటామని కుటుంబసభ్యులకు తెలిపారు. వారి నిరాకరణతో మనస్థాపానికి గురయ్యారు.
తీవ్ర మనస్తాపంతో ఇద్దరూ చైతన్యపూరిలో రాజధాని సినీమా థియేటర్ సమీపంలోని సందీప్ రెడ్డి గదికి చేరుకున్నారు. తాము మరణించిన తర్వాత తమ సమాధులను పక్క, పక్కనే ఏర్పాటు చేయాలని... కుటుంబసభ్యులు గొడవ పడవద్దని సూసైడ్ నోట్ రాశారు. తర్వాత వెంటతెచ్చుకున్న క్రిమిసంహారక గుళికలను శీతల పానీయంలో కలుపుకుని తాగారు. ఈ ఘటనలో సందీప్ రెడ్డి మృతి చెందగా, త్రివేణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పసి ప్రాణాన్ని మింగేసిన బోరు బావి