ETV Bharat / state

వీడియో కాల్​లోనే.. కొడుకు కడసారి చూపులు - latest news on ananthapur lockdown

లాక్​డౌన్​ ప్రభావంతో ఆ తల్లిదండ్రులకు కొడుకుని కడసారి చూసుకునే అవకాశమూ దక్కలేదు. పొట్టకూటి కోసం సొంతూరు దాటి హైదరాబాద్​ కొచ్చిన కొడుకు గుండె పోటుతో మరణించాడు. కోడలు గర్భిణి.. దారిలేక వీడియో కాల్​లోనే తల్లిదండ్రులు.. కొడుకుని చివరిసారి చూసుకున్నారు.

వీడియో కాల్​లోనే.. కొడుకు కడసారి చూపులు
వీడియో కాల్​లోనే.. కొడుకు కడసారి చూపులు
author img

By

Published : Apr 25, 2020, 12:42 PM IST

కరోనా సృష్టించిన కఠిన పరిస్థితులు... మానవ భావోద్వేగాలనూ అదుపు చేస్తున్నాయి. కన్నకొడుకు మరణించినా... కడసారి చూసుకోలేని స్థితిని కల్పించాయి. ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతికి చెందిన సుంకన్న బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చిన్నహోటల్‌ నిర్వహిస్తున్న సుంకన్న శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య ప్రస్తుతం ఏడునెలల గర్భిణీ.

సొంతూరిలో తల్లిదండ్రుల సమక్షంలో అంత్యక్రియలు చేద్దామనుకున్న ఆమె మృతదేహంతో ఊరికి బయలుదేరింది. అయితే అంత్యక్రియలు పూర్తైన తర్వాత 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పటం వల్ల అన్ని రోజులు తనకు వీలుకాదని భావించిన ఆమె... మార్గంమధ్యలోనే వెనుతిరిగింది. వీడియో కాల్‌లోనే తల్లిదండ్రులు సుంకన్నను కడసారి చూశాక... భాగ్యనగరంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.