ETV Bharat / state

నవంబర్ వరకు అప్పులతో రూ.38 వేల కోట్లు సమకూర్చుకున్న సర్కార్ - మరో రూ. 15వేల కోట్లు కోరిన ప్రభుత్వం - telangana Quarters loan

Loan for Telangana State : చివరి త్రైమాసికంలో తీసుకునే రుణం అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అప్పుల వాటా పూర్తయింది. వడ్డీలు సహా అసలు చెల్లింపులు చేసిన పరిస్థితుల్లో ఆ స్థానంలో మళ్లీ రుణం తీసుకునేలా అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది.

Telangana Loan From RBI
Loan for Telangana State
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 8:17 PM IST

Loan for Telangana State : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్​ఆర్​బీఎం(FRBM) పరిధికి లోబడి రూ. 40 వేల 615 కోట్ల రుణాలు బహిరంగ మార్కెట్​లో తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్(Reserve Bank) ద్వారా బాండ్లను వేలం వేసి నిధులు సమీకరించుకుంటోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం, నవంబర్ నెలాఖరు వరకు 38వేల 151 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా సమీకరించుకుంది.

డిసెంబర్ నెలలో మరో రూ. 1400 కోట్లు రుణంగా తీసుకుంది. దీంతో ఎఫ్​ఆర్​బీఎం పరిధికి లోబడి రాష్ట్రం రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. చివరి త్రైమాసికంలో కనీసం 13 వేల కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమీకరించుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అయితే అప్పు తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది.

Telangana Loan From RBI : రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంత మేర చెల్లింపులు చేసింది. వడ్డీలతో పాటు అసలు కూడా చెల్లించింది. దీంతో వాటి స్థానంలో కొత్త రుణాలకు అనుమతి ఇస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. చివరి త్రైమాసికంలో రూ. 15 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖను(Central Ministry of Finance) రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసి కొత్త రుణాలు తీసుకుంటారు. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ నుంచి అనుమతి వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖజానా దివాళా తీసిందని చెబుతోంది. గత ప్రభుత్వం అనవసరమైన అంశాల కోసం భారీగా నిధులు ఖర్చు పెట్టిందని హస్తం నేతలు ఆరోపించారు. గత కేసీఆర్ సర్కార్ అనవసరమైన అప్పులు చేసి గొప్పలకు పోయిందని వారు విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ముందుగా ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఖజానా ఖాళీ అవడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telangana Debts in 2022-23 : పెరుగుతున్న రుణభారం.. 2022-23లో రూ.20 వేల కోట్ల మార్కు దాటిన అప్పు

Telangana debt 2023 : తెలంగాణ అప్పు రూ. 3,66,306 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.