హైదరాబాద్ మద్యం డిపో నుంచి డీసీఎంలో బౌరంపేట్కు మద్యాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు బాలానగర్ చౌరస్తాలో డివైడర్ను డీకొని .. డీసీఎం ఓ పక్కకు ఒరిగిపోయి రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. ఆ సమయంలో రోడ్డు మీద ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మద్యాన్ని ఎవరు దొంగిలించకుండా అడ్డుకుని వాహనాన్ని క్రేన్ సాయంతో పక్కకు తీశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూశారు.
ఇదీ చదవండి: BANDI SANJAY: భాజపా ఎప్పటికీ తెరాసతో కలిసి పోటీ చెయ్యదు