ETV Bharat / state

ప్రధాన రహదారుల్లో వెలగని దీపాలు.. పట్టించుకోని అధికారులు

లాక్‌డౌన్‌ అమల్లో ఉండడం వల్ల.. అటు జనసంచారం లేక, ఇటు విద్యుద్దీపాలు లేక అత్యవసర పనులపై వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. రవాణా సదుపాయం లేక నడుచుకుంటూ ఇంటికెళ్లే కార్మికులు, మహిళా సిబ్బంది బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. పలుచోట్ల కుక్కలు గుంపులు గుంపులుగా నడిరోడ్లపై సంచరిస్తుంటే ఆందోళన చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పట్టించుకోకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ వార్తలు, వెలగని విద్యుద్దీపాలు
hyderabad lights, main road lights
author img

By

Published : May 17, 2021, 9:38 AM IST

వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల హైదరాబాద్​లోని ప్రధాన రహదారులతోపాటు కాలనీల రోడ్లూ అంధకారంగా మారుతున్నాయి. కొంత దూరం వెలిగితే.. మరికొంత దూరం చీకట్లు అలముకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో రహదారికి ఓ వైపే పని చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. చాలా రోజులుగా మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ వరకు వెలగడం లేదు.

నిర్వహణ అధ్వానంగా..

వీధిలైట్ల నిర్వహణను జీహెచ్‌ఎంసీ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈఈఎస్‌ఎల్‌కు అప్పగించింది. ఆ సంస్థ నగరంలోని ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు బదలాయించింది. దీంతో మాకు సంబంధం లేదంటూ బల్దియా ఇంజినీర్లు, ఈఈఎస్‌ఎల్‌ అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. అప్పట్నుంచి ఎలక్ట్రికల్‌ విభాగంలోని పలువురు ఇంజినీర్లు వీటి గురించి పట్టించుకోవడం మానేశారని విమర్శలొస్తున్నాయి. కేంద్ర, జోనల్‌ కార్యాలయ అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ గాలికి వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌లో 98శాతానికిపైగా వెలుగుతున్నట్లు చూపిస్తూ ఇంజినీర్లు మోసం చేస్తున్నారన్నది పౌరుల వేదన.

సమస్యలున్న ప్రాంతాలు..

* శిల్పారామం నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు వీధి లైట్లు వెలగడం లేదు. మాదాపూర్‌ మెట్రో స్టేషన్‌ ప్రాంతం చీకట్లలో కూరుకుపోయింది. అయ్యప్ప సొసైటీ రోడ్డు, అంతర్గత కాలనీ మార్గాల్లోనూ దాదాపు అదే పరిస్థితి. పంజాగుట్ట పైవంతెనపై, బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఎదురు లైన్‌లోని రోడ్డు, జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయం దగ్గరున్న ప్రధాన రహదారి, సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల వైపు ఉన్న రోడ్డు మార్గం, రెజిమెంటల్‌బజార్‌లోని పలు కాలనీల్లో సమస్యలున్నాయి.

* ఐటీ కారిడార్‌ నుంచి మెహిదీపట్నం.. అక్కడ నుంచి శివరాంపల్లి చౌరస్తా..జూపార్కుకు వెళ్లే మార్గాల్లో సగం నిత్యం మరమ్మతులకు గురవుతుంటాయి. ఓయూకాలనీ రోడ్డుతోపాటు షేక్‌పేట డివిజన్‌లోని కాలనీలో 30శాతం వరకు పనిచేయట్లేదు. రాజేంద్రనగర్‌ డెయిరీఫామ్‌ నుంచి హిమాయత్‌సాగర్‌ వెళ్లే దారిలోనూ చీకట్లే. అబిడ్స్‌ చాపెల్‌రోడ్డు, ఎస్బీహెచ్‌ బ్యాంకు రోడ్డు, ముసారాంబాగ్‌ నుంచి గోల్నాక వెళ్లే రహదారి, చాదర్‌ఘాట్‌ నుంచి కాచిగూడ రోడ్డు మార్గంలో ప్రయాణికులు చీకట్లోనే ప్రయాణిస్తున్నారు.

ఇదీ చూడండి: వేధిస్తున్న టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్ల కొరత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.