కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి గణపతి నవరాత్రులు ఎలా జరుపుకుంటారనే ఆందోళనలో ఉన్న భక్తులకు ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల భక్తి గీతాలతో అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై పోరాటంలో పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తోన్న రామ్ మిర్యాల... గణేశ్ ఉత్సవాలపై తగిన జాగ్రత్తలు సూచిస్తూ "లంబోదర" అనే పాటను ఆలపించారు.
కొవిడ్ వైరస్ వ్యాప్తి పెరిగిన దృష్ట్యా... "లంబోదరా.. ఎట్టా కొలిచేదంటూ" తన పాటలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారికి మన్నించయ్యా అంటూ వేడుకున్నారు. ప్రస్తుతం ఆ పాట సామాజిక మాద్యమాల్లో దూసుకెళ్తోంది.