హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద సీఏఏకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఐకాస ధర్నా చేపట్టింది. వీరికి కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు తెలిపారు.
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని న్యాయవాదులు కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కోవాలన్నారు.
ఇవీ చూడండి: ముగింపు నేడే: సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం