Lawyer Fires Gun In a Clash at Old City : హైదరాబాద్ పాతబస్తీలో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఆస్తి తగాదాల కారణంగా జరిగిన గొడవలో ఓ న్యాయవాది తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇరు వర్గాలు కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే అరఫత్ అనే వ్యక్తి మీర్‌చౌక్ లో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆ ఇంటి పక్కన నివసించే వారు అతనితో గొడవకు దిగారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఇల్లు ఎలా కొనుగోలు చేశావంటూ న్యాయవాది మసూద్ వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు చెందిన వారు కర్రలు, కత్తులతో దాడులకు దిగారు.
కోపోద్రిక్తుడైన న్యాయవాది ఇంట్లో ఉన్న తన లైసెన్స్డ్ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయవాది సహా మరో వర్గం వారినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా స్థానికంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయంలో గత శనివారమే ఇల్లు కొనుగోలు చేసిన అరఫత్ అనే వ్యక్తి తమకు ఫిర్యాదు చేశాడని మీర్‌చౌక్ ఏసీపీ తెలిపారు. మొత్తం మీద పాతబస్తీలో కాల్పులు కలకలం సృష్టించాయి.
'గత శనివారం అరఫత్ అనే వ్యక్తి మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నేను ఇల్లు కొనుక్కున్నాను కానీ.. ఆ ఇంట్లోకి పోదామంటే పక్కన వారు పోనివ్వడం లేదు. ఎందుకు వెళ్లనివ్వడం లేదని అడిగితే.. ఆ ఇల్లు గురించి కేసులు నడుస్తున్నాయని.. అలా ఎలా కొన్నావని అంటున్నారని ఫిర్యాదులో తెలిపాడు. తను ఇచ్చిన కంప్లైంట్ తీసుకోని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. -దామోదర్ రెడ్డి, మీర్‌చౌక్ ఏసీపీ
Firing Took Place At Indalwai Toll Gate : ఇటీవలె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్గేట్ వద్ద కాల్పులు జరిగాయి. తన వాహనంపైకి దొంగలు దూసుకొస్తున్నారని అతని ఆత్మరక్షణ కోసం ఎస్సై గాల్లో కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ చోరీ చేసిన ముఠా 44వ జాతీయ రహదారిపై వెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న ముప్కాల్ పోలీసులు వారిని వెంబడించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి: