సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్‌లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల గిఫ్టులు ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అన్ని పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు బట్టలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. యేసు క్రీస్తు ప్రేమ దయ కరుణ కలిగి ఉండాలని బోధించాడని వాటిని ప్రతి ఒక్కరు ఆచరించాలి అన్నారు. తప్పు చేసే వారిని క్షమించే గుణం కలిగి ఉండాలని.. దయాగుణం డబ్బుతో కూడుకున్నది కాదని.. మాట సాయం గానీ ఇతర ఏ విధంగానైనా ఉండవచ్చని యేసు క్రీస్తు బోధించిన దానిని ఆచరిస్తేనే ఆయన అనుగ్రహం ఉంటుందని చెప్పారు. క్రైస్తవులు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నుంచి లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. క్రిస్మస్కు రెండు రోజుల సెలవును ప్రజలకు అందించే విధంగా చూస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: భూ సేకరణలో రాజీతోనే వంతెన వంపులు తిరిగింది!