ట్రావెల్స్ బస్సుల్లో ఆంధ్ర, రాయలసీమ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కుసుమ పాల్ రాజ్ విజయవాడ, రాజమండ్రి ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేవాడు. ఇతర ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నాక లాప్‌ట్యాపులు అపహరించి తరువాయి బస్ స్టేషన్లో దిగిపోయేవాడు. దొంగిలించిన వస్తువులను రాజమండ్రిలో విక్రయించే వాడు. ఈ విధంగా సంవత్సర కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు.
ఈ రోజు ఉదయం కేపీహెచ్‌బీ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించటం వల్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... నిందితుడు చేసిన దొంగతనాల వివరాలు తెలిపాడు. అతని వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన 10 లాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి : చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి