ETV Bharat / state

సీసీ కెమెరాల మ్యాజిక్.. పోయిన నగదు గంటల్లోనే బాధితునికి చేరింది.. - లంగర్ హౌస్ పోలీస్‌స్టేషన్‌ తాజా వార్తలు

POLICE RECOVERY 4 LAKHS CASH BAG: హైదరాబాద్ పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ వ్యక్తి పోగొట్టుకున్న 4 లక్షల నగదును 24 గంటల్లో బాధితునికి అందించారు. ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

The police handed back the lost four lakh rupees to the victim
పోగొట్టుకున్న 4 లక్షల నగదును బాధితుడికి అప్పగిస్తున్న పోలీసులు
author img

By

Published : Mar 5, 2022, 12:54 PM IST

Updated : Mar 5, 2022, 12:59 PM IST

POLICE RECOVERY 4 LAKHS CASH BAG: హైదరాబాద్‌ లంగర్ హౌస్ ఖాదర్ బాగ్ లో నివసించే మీర్ అక్తర్‌ అలీ శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటి నుంచి యాక్టివాపై భార్యతో కలిసి వెళ్తున్నారు. ఇదే సమయంలో తన వద్ద 4 లక్షల నగదు ఉన్న బ్యాగు మధ్యలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన అతను లంగర్ హౌస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బైక్​పై ఉన్న వ్యక్తికి డబ్బుల బ్యాగ్ దొరకిందని గమనించారు.

పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అడగగా డబ్బులు తన వద్దనే ఉన్నాయని చెప్పాడు. వారు ఆ డబ్బులను తీసుకొని మీర్ అక్తర్‌ అలీని పిలిచి 4 లక్షలు అప్పగించారు . ఆనందంతో అలీ కృతజ్ఞతలు తెలుపుతూ పోలీసులకు సన్మానం చేశారు.

ఇదీ చదవండి: Traffic Pending Challan: 4 రోజుల్లో 54 లక్షల చలానాలు.. రాయితీలకు భారీ స్పందన

Last Updated : Mar 5, 2022, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.