మహానంది పుణ్యక్షేత్రంలో కార్తిక మాసం సందర్భంగా రోజూ ప్రధాన ఆలయం ఎదుట మహాధ్వజ స్తంభంపైనున్న మేఖలం వరకు దీపాన్ని చేరవేసి తెల్లవారేవరకు వెలిగించడం ఆనవాయితీ. ఈ దీపానికి పూజలు చేసి రోజూ సాయంత్రం 6 గంటలకు ధ్వజానికి కడతారు. సోమవారం రాత్రి ఆకాశ దీపం ధ్వజస్తంభంపై నుంచి కోనేరు(పుష్కరిణి)లో పడిపోయింది. సిబ్బంది కోనేట్లో దిగి దీపాన్ని బయటకు తీశారు. అనంతరం క్షమాపణ పూజలు చేపట్టారు.
ఇదీ చదవండి: స్థిరాస్తి వ్యాపారానికి ప్రోత్సాహం... ఫీజు చెల్లింపునకు వాయిదాలు