కరోనా మహమ్మారి వల్ల అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని కార్యాలయంలో 30 మంది దివ్యాంగులకు బియ్యంతో పాటు నిత్యావసరాలను ఆయన పంపిణీ చేశారు.
లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... తోచిన విధంగా వారికి అండగా ఉండాలని కోరారు. దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పూజించి.. పేదవారి ఆకలి తీర్చాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం