చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం అక్రమమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా ఆరోపించారు. సీఎం కేసీఆర్ వెంటనే ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. యాభై వేల మంది జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడడం సబబు కాదని చెప్పారు. బస్సుల సమ్మెతో కోట్లాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని కుంతియా అన్నారు. సర్కారు మొండి వైఖరిని వీడి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపి.. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ తీరుతో కోట్లాది మంది అవస్థ: కుంతియా - ఆర్టీసీ సమస్యలపై కేసీఆర్ వెంటనే స్పందించాలిః కుంతియా
కేసీఆర్ తీరుతో కోట్లాదిమంది ప్రజలు అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం తీరు మార్చుకోవాలని, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం అక్రమమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా ఆరోపించారు. సీఎం కేసీఆర్ వెంటనే ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. యాభై వేల మంది జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడడం సబబు కాదని చెప్పారు. బస్సుల సమ్మెతో కోట్లాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని కుంతియా అన్నారు. సర్కారు మొండి వైఖరిని వీడి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపి.. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
TAGGED:
kuntiya about tsrtc strike