హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇస్కాన్ శోభా యాత్ర ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు యాత్రను ప్రారంభించారు. మనిషి ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాడని.. రూపం ఏదైనా భగవన్నామస్మరణ అనేది ముఖ్యమన్నారు. నేటి కాలంలో ఉద్యోగాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, వీటన్నిటిని అధిగమించేందుకు ఆధ్యాత్మిక చింతన ముఖ్యమన్నారు.
హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలి
హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచ దేశాల్లో హిందూ సంప్రదాయానికి, కుటుంబ వ్యవస్థకి గొప్ప స్థానం ఉందని తెలిపారు. ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ఇస్కాన్ ప్రతినిధులు భగవంతుని సేవలో తమ జీవితాన్ని అంకితం చేయటం అభినందనీయమని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే..