ETV Bharat / state

KTR Tweet Today : 'వైవిధ్యం, కలుపుకుపోయే తత్వం భాగ్యనగరం సొంతం' - మంత్రి కేటీఆర్ వార్తలు

Minister KTR Tweet Today: హైదరాబాద్ మహానగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి ప్రతిరూపం అని మంత్రి కేటీఆర్ అన్నారు. వైవిధ్యం, కలుపుకుపోయే తత్వాన్ని భాగ్యనగరం కలిగి ఉందని పేర్కొన్నారు. అమెరికాతో హైదరాబాద్​కు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కేటీఆర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

KTR Tweet Today
KTR Tweet Today
author img

By

Published : Apr 14, 2023, 10:16 AM IST

Minister KTR Tweet Today: ఇప్పుడున్న రాజకీయ నేతలంతా ట్విటర్​లో సూపర్ యాక్టివ్​గా ఉంటున్నారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే పోస్ట్​ చేస్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రి కేటీఆర్ అయితే ట్విటర్​లో యమా యాక్టివ్. ప్రజాసమస్యలతో పాటు రాష్ట్రాభివృద్ధి, కేంద్రంపై విమర్శలు, ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ట్విటర్​ను వేదిక చేసుకుంటారు కేటీఆర్. ఇక ఏదైనా విషయాన్ని ప్రజలతో పంచుకోవాలనుకున్నా కేటీఆర్ ఈ సామాజిక మాధ్యమానికే ప్రాధాన్యతనిస్తారు.

KTR Tweet Today: అలా మంత్రి కేటీఆర్.. ఇవాళ అమెరికాతో హైదరాబాద్ మహానగరానికి ఉన్న అనుబంధాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి నిలయమైన హైదరాబాద్.. వైవిధ్యం, కలుపుకుపోయే స్ఫూర్తిని సూచిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో చదువు, పనిచేస్తున్న తెలుగు కుటుంబాలని మంత్రి ఉదహరించారు. అమెరికా సెనేటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని గురువారం రోజున హైదరాబాద్‌లో కలిసింది. ఈ సందర్భంలోనే అమెరికా-హైదరాబాద్ అనుబంధాన్ని కేటీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు.

  • A delegation led by US Senator @SenToddYoung met Minister @KTRBRS in Hyderabad today.

    Minister spoke about the significant presence of marquee US tech companies in Hyderabad and how the city has transformed into a thriving hub for life sciences in India. pic.twitter.com/U5HkvyEuCi

    — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సమావేశంలో జెన్నిఫర్ లార్సన్, ఎంపీ దామోదర్ రావు దివకొండ, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్​రెడ్డి పాల్గొన్నారు. ఐటీ, లైఫ్‌ సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ వర్తమానం, భవిష్యత్‌ గురించి విస్తృతమైన యూఎస్- భారతీయ సంబంధాలతో ఎలా ముడిపడి ఉన్నాయనే అంశాలని మంత్రి కేటీఆర్ వారికి వివరించారు.

లైఫ్ సైన్స్​స్ రంగంలో హైదరాబాద్ అగ్రగామి: దేశంలోని అమెరికా టెక్‌ కంపెనీల గణనీయమైన ఉనికి లైఫ్‌ సైన్సెస్‌ కోసం నగరాభివృద్ధి ఎలా రూపాంతరం చెందిందో కేటీఆర్ అమెరికా సెనేటర్ బృందానికి తెలియజేశారు. హైదరాబాద్‌లోని ప్రగతిశీల వ్యాపార వాతావరణం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచ వ్యాపారాలను ఆకర్షిస్తున్న ప్రధాన అంశాలని చెప్పారు. లైఫ్ సైన్స్​స్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని.. ఔషధ ఉత్పత్తికి ఆసియాలోనే హైదరాబాద్ పెద్ద నగరమని వెల్లడించారు. ఈ రంగంలో హైదరాబాద్​కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయని.. 800కు పైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలున్నాయని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. భాగ్యనగరానికి ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో.. హైదరాబాద్ పేరు దేశమంతా వ్యాప్తి చెందిందని చెప్పారు. ఇక్కడి ఉత్పాదకత, విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, వాణిజ్యం పెరగాడానికి దోహదపడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.