ETV Bharat / state

KTR Review on GHMC : 'త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ' - KTR on Hyderabad latest news

KTR Review on GHMC : జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. పంపిణీ చేసేలా లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో.. బల్దియా, వాటర్ బోర్డు, మెట్రో రైల్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ విభాగాల అధికారులతో మంత్రి కన్వర్జేన్సీ సమావేశాన్ని నిర్వహించారు. అన్ని విభాగాలు కలిసి పనిచేయాలన్న లక్ష్యంతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేశామని.. అందుకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని కేటీఆర్ సూచించారు.

KTR review on GHMC
KTR review with GHMC officials
author img

By

Published : Aug 7, 2023, 8:22 PM IST

Updated : Aug 7, 2023, 10:46 PM IST

KTR Review on GHMC : హైదరాబాద్‌లో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, మూడు కమిషనరేట్ల సీపీలు, విద్యుత్, జీహెచ్‌ఎంసీ పలువురు ఉన్నతాధికారులు హజరయ్యారు.

GHMC mayor on hyderabad rains : " 946కు పైగా సమస్యల పరిష్కారం.. 24 గంటలు అందుబాటులో"

KTR Instructions to Officials : ప్రజాసమస్యల పరిష్కారంలో జీహెచ్‌ఎంసీ ముఖ్య పాత్ర పోషిస్తుందన్న కేటీఆర్.. ఏ శాఖ అధికారులైనా.. బల్దియా అనుమతి తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన (KTR Review) సూచించారు. ముఖ్యంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిమితికి మించిందని.. అందుకనుగుణంగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు డంప్ యార్డుల కోసం భూమిని గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్లను కేటీఆర్ ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా జనావాసాలకు దూరంగా ఉండేలా.. హైదరాబాద్‌కు 50 ఏళ్ల వరకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ క్రమంలోనే వ్యవసాయానికి యోగ్యత లేని.. ఖాళీగా ఉన్న క్వారీలను డంపింగ్ యార్డులుగా ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. దుండిగల్, ఖానపూర్, ప్యారానగర్.. డంప్ యార్డ్‌ల అంశంలో.. వారంలో పూర్తి నివేదిక సమర్పించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR Instructions to BRS Leaders : 'మెట్రో విస్తరణ నియోజక వర్గాల్లో సంబరాలు నిర్వహించాలి'

ఈ నేపథ్యంలోనే నిర్మాణ వ్యర్థాలను.. ప్రైవేట్ డంపు యార్డ్ నిర్వహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే పోలీస్ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. జోనల్ కమీషనర్ల స్థాయిలో కూడా కన్వర్జేన్సీ సమావేశం నిర్వహించి.. అక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.

మరోవైపు పాతబస్తీ రోడ్ల విస్తరణ సమస్యలకు కేటాయించిన.. రూ.150 కోట్లను జీహెచ్‌ఎంసీ వినియోగించుకోవాలని కేటీఆర్ తెలిపారు. ట్రాఫిక్, ఇతర అధికారులు ఈ అంశంపై సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన 14 బ్రిడ్జ్‌లకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు.. అందుకోసం ఆయా విభాగాలు అన్ని అంశాలు పూర్తిచేయాలని తెలిపారు. ఇందుకు సంబంధించి టెండర్లు పూర్తిచేస్తామని కేటీఆర్ వివరించారు.

KTR Review Meeting with High Officials : 'సహాయక చర్యలు సవాలుగా స్వీకరించి.. ముందుకు సాగాలి'

మూసీ నది సుందరీకరణ.. నది ఒడ్డున ట్రామ్.. నదిపైన ఫ్లై ఓవర్లు నిర్మాణం జరిగే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొండపోచమ్మ సాగర్ నుంచి.. ఉస్మాన్‌సాగర్‌కు నీళ్లు తరలించవచ్చని చెప్పారు. ఉస్మాన్‌సాగర్ నుంచి నీరు వదిలితే మూసీలో మురుగు కాకుండా మంచినీళ్లు పారుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేలా.. నగరం మధ్యలో నుంచి ఔటర్‌రింగ్ రోడ్డును.. ఓ వైపు నుంచి మరోవైపును కలుపుతూ 4, 6 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ వే ప్రణాళికను అమలు చేసేందుకు..చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ వివరించారు.

KTR Review Meeting with GHMC Officials : హైదరాబాద్‌లో పార్కింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో.. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేయడానికి.. ప్రణాళికలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నగరంలో నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్టును ప్రోత్సాహించడంతో పాటు.. అవసరం ఉన్నచోట స్కై వాక్‌ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. రహదారులపై యూటర్న్‌లు ఏర్పాటు చేసే సమయంలో.. ట్రాఫిక్ పోలీసులు.. బల్దియా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

గూగుల్ స్ట్రీట్ వ్యూ సమన్వయంతో.. జీహెచ్‌ఎంసీ యాప్ డెవలప్ చేయాలని కేటీఆర్ (KTR GHMC Review) సూచించారు. ఈ క్రమంలోనే బల్దియా కార్యాలయల వద్ద ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు.. ఉద్యోగులు ఎలక్ట్రికల్ వాహనాలు ఉపయోగించేందుకు ప్రోత్సాహించాలని వెల్లడించారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో పూర్తైన డబుల్ బెడ్ రూం ఇళ్లను.. అక్టోబర్ నాటికి పూర్తిగా పంపిణీ చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి.. లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలో పౌరుల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని పబ్బులు, హుక్కా సెంటర్లు, పాఠశాలలు, ఫామ్‌హౌజ్‌ల చుట్టూ నిఘా పెంచాలని పోలీసు విభాగాన్ని ఆదేశించారు. మాదక ద్రవ్యాల అలవాట్లు తీవ్రమైన నేరాలకు కారణం అవుతున్నాయని చెప్పారు. గంజాయి విక్రయంపై ఉక్కుపాదం మోపి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పోలీసు ఉన్నతాధికారులకు కేటీఆర్ సూచించారు.

KTR Review on Greater Warangal : 'వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అదనంగా రూ.250కోట్లు విడుదల'

KTR Speech at Assembly Sessions 2023 : 'సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత.. తప్పైతే వచ్చే ఎన్నికల్లో ఓడించండి'

Last Updated : Aug 7, 2023, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.