ETV Bharat / state

KTR on Telangana Policing System : 'పోలీస్​శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చి.. ప్రజల భద్రతకు భరోసా కల్పించాం'

KTR on Suraksha Day Celebrations : పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టి.. ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్షా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీసులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.

KTR
KTR
author img

By

Published : Jun 4, 2023, 12:35 PM IST

KTR on Telangana Policing System : రాష్ట్ర అభివృద్ధిలో భద్రత కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే విషయం సీఎం కేసీఆర్ సైతం విశ్వసిస్తారని వ్యాఖ్యానించారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ పోలీస్ వ్యవస్థకు అభినందనలు తెలుపుతూ మంత్రి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.

పోలీస్​ శాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టి.. ప్రజలకు భరోసా కల్పిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్షా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీసులు, సంబంధిత శాఖల్లో పని చేసే ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంతతకు చిరునామాగా తెలంగాణ నిలుస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను వినియోగిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

పోలీస్ నియామకాలను భారీగా పెంచటంతో పాటు ఆధునిక వాహనాలతో పోలీసింగ్​ వ్యవస్థను మరింత పటిష్టపరిచామన్నారు. కమిషనరేట్లు, కొత్త పోలీస్ స్టేషన్లు, నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాలతో పోలీస్ వ్యవస్థ ముఖచిత్రమే మారిందని హర్షం వ్యక్తం చేశారు. మహిళా భద్రత కోసం షీ టీమ్స్, షీ క్యాబ్స్ వంటివి తీసుకొచ్చి ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం భరోసా ఇస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో సీసీ టీవీలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయటంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్​లో భాగంగా సీసీటీవీల ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేశామన్నారు. దీని ద్వారా నేరాల నియంత్రణకు విశేష కృషి చేస్తున్నామని తెలిపారు.

Suraksha Day in Telangana Decade Celebrations : ప్రపంచంలో అత్యధిక సీసీటీవీలతో పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణ చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన నిలిచిన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ఏర్పాటు చేశామన్నారు. కేవలం హైదరాబాద్ నగరమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సరే కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Police Command Center in Hyderabad : అన్ని జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానం చేసినట్లు వివరించారు. మెరుగైన శాంతిభద్రతల కోసం సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ.. 360 డిగ్రీల కోణంలో నిఘాను కొనసాగిస్తూ.. ప్రజల భద్రతకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భరోసా కల్పిస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.