ETV Bharat / state

KTR on September 17th Celebrations : 'సెప్టెంబర్​ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని సంబురంగా నిర్వహించుకోవాలి' - తెలంగాణలో సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవాలు

KTR on September 17th Celebrations Telangana : తెలంగాణలో సెప్టెంబరు 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. ఆరోజు తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన దినంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

BRS celebrate national integration day sept 17th
KTR Latest News
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 6:01 PM IST

KTR on September 17th Celebrations Telangana : తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్‌ 17వ తేదీని(KTR on September 17th).. జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబురంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ వివరించారు.

దీంతో పాటు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సంబురాల్లో.. మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఇందులో భాగంగానే వినూత్నమైన కార్యక్రమాలతో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ వి(ముక్తి)మోచనదినంపై భాజపా ఫోకస్​.. ఏడాది పాటు ఉత్సవాలు..

BRS Plan to Celebrate National Integration Day : అయితే తెలంగాణ అభివృద్ధి పట్ల ఓర్వలేని రాజకీయ పార్టీలు.. ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు సంబురంగా జరుపుకునే జాతీయ సమైక్యతా దినోత్సవంపై కూడా.. కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి.. సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు.

ఈ క్రమలోనే 1948 సెప్టెంబర్ 17న ( National Unity Day in Telangana)సువిశాల దేశంలో.. తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు అని కేటీఆర్ గుర్తు చేశారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజు అని అన్నారు. ఈ సందర్భం అందరికి గుర్తు ఉంటుందని చెప్పారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను సైతం వక్రీకరించి.. తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

PRATHIDWANI: తెలంగాణ చరిత్రలో ఆరోజు జరిగిందేంటి? ప్రాణాలకు తెగించి ప్రజలెందుకు పోరాడారు?

National Unity Day in Telangana : ఆనాటి చరిత్రతో, పరిణామాలతో సంబంధం లేని అవకాశవాదులు.. చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. అదే చైతన్యాన్ని ప్రదర్శించాలని అన్నారు. తెలంగాణ జీవనాడిని కలుషితం చేయాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Amit Shah Telangana Tour On September 17th : మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండోసారీ నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌(Secunderabad Parade Ground) సిద్ధమవుతోంది. ఉత్సవాలకు ముఖ్య అథితిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరై.. మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. గతేడాది మొదటిసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

పార్టీ కార్యాలయాల్లో ఘనంగా 'సెప్టెంబర్​ 17' వేడుకలు

వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విమోచన ఉత్సవాలు: కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.