ETV Bharat / state

మెజార్టే మీ పనితీరుకు సూచిక: కేటీఆర్ - trs

గ్రేటర్ పరిధిలోని లోక్​సభ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించేలా కార్పొరేటర్లు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. నగరంలోని రోడ్ షోలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.  తెలంగాణ భవన్​లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు.

ktr
author img

By

Published : Apr 1, 2019, 6:54 PM IST

Updated : Apr 1, 2019, 11:30 PM IST

కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం
గ్రేటర్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కార్పొరేటర్లకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమై లోక్​సభ ఎన్నికల కోసం దిశానిర్దేశం చేశారు.

విస్తృతంగా ప్రచారం చేయండి

ఇంటింటికి వెళ్లి తెరాస సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. గ్రేటర్‌ పరిధిలోని చేవేళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాల్లోనూ తెరాస అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా కార్పొరేటర్లు కృషి చేయాలన్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులు యువకులు కావడం పార్టీకి కలిసొస్తుందన్నారు.

రోడ్​ షోలను విజయవంతం చేయాలి

పార్లమెంట్ ఎన్నికల్లో వారి వారి డివిజన్లలో సాధించే మెజార్టీలను కార్పొరేటర్ల పనితీరుకు సూచికగా భావిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టనున్న రోడ్ షోల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ ప్రచారానికి సంబంధించి మేయర్ బొంతు రామ్మోహన్​తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి

Intro:Body:Conclusion:
Last Updated : Apr 1, 2019, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.