ETV Bharat / state

మారోమారు మానవత్వం చాటిన కేటీఆర్​ - students

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోమారు మానవత్వాన్ని చాటారు. పేదరికాన్ని జయించి... చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థినిలకు ఆయన ఆర్థిక సాయం అందించారు. తల్లితండ్రులు లేని పేద విద్యార్థిని రచన, ఆర్థిక స్తోమత లేని అంజలి గురించి మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ వారిని తన నివాసానికి పిలిపించుకుని చదువులకు కావలసిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హమీ ఇచ్చారు.

మానవత్వం చాటిన కేటీఆర్​
author img

By

Published : Jul 18, 2019, 7:58 PM IST

ట్విట్టర్ వేదికగా సమస్యల్ని పరిష్కరించడంలో కేటీఆర్ దిట్ట. జగిత్యాల జిల్లా తాండ్రియాల గ్రామానికి చెందిన రుద్రరచన చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయింది. ఈసెట్​లో మంచి ర్యాంకు సాధించి చైతన్య భారతి ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించింది. ఫీజు కట్టే స్తోమత లేకపోవడం వల్ల రచన పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకుని రుసుములకు కావాల్సిన అర్థిక సహాయాన్ని అందజేశారు. తనలాగే అనేకమంది విద్యావంతులైన అనాథలు రాష్ట్రంలో ఉన్నారని.... వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రచన కేటీఆర్​కు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని కేటీఆర్​ హమీ ఇచ్చారు. ప్రస్తుతం రచన బాగోగులు చూసుకుంటున్న ఆమె అక్క బావలకి అవసరమైన ఉపాధి కల్పించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్​కి కేటీఆర్ ఫోన్ ద్వారా సూచించారు.

మరో విద్యార్థినికి కూడా...

పేదరికాన్ని జయించి ఐఐటీ ఇండోర్​లో సీటు సాధించిన మరో విద్యార్థిని మేకల అంజలికి సైతం కేటీఆర్ సాయం చేశారు. వరంగల్ జిల్లా హసన్​పర్తి గ్రామానికి చెందిన అంజలి తండ్రి రమేశ్​ ఆటో డ్రైవర్. అంజలి ఐఐటీ ఇండోర్​లో సీటు సాధించినప్పటికీ.. ఆమె ఫీజుల్ని చెల్లించేందుకు ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. తన తండ్రి బాధల్ని, తాను ఐఐటీలో సీటు పొందిన విషయాన్ని కేటీఆర్​కు అంజలి ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఈరోజు అంజలిని తన నివాసానికి పిలిపించుకొని ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తానని అంజలి తెలిపారు.

మానవత్వం చాటిన కేటీఆర్​

ఇవీ చూడండి: ఈ కల్పన ఇంట్లో నీటి కరవు లేనే లేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.