ETV Bharat / state

సరస్వతి పుత్రులకు కేటీఆర్​ ఆర్థిక సహాయం - కుష్వంత్‌

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంసెట్​లో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మరో ఇద్దరు విద్యార్థులకు ఆయన సొంత డబ్బు సాయం చేశారు.

కేటీఆర్​ ఆర్థిక సహాయం
author img

By

Published : Jul 26, 2019, 11:08 PM IST

సరస్వతి పుత్రుడికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహయం అందించింది. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో 8వ ర్యాంకు, నీట్‌ స్థాయిలో 50వ ర్యాంకు సాధించిన కుష్వంత్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కేటీఆర్ రూ.5 లక్షలు అందించారు. కుష్వంత్‌ చదువులో ప్రతిభ కనబరచడం వల్ల దిల్లీ ఎయిమ్స్‌లో సీటు వచ్చింది. విద్యార్థి ఉన్నత చదువులకు అవసరమైన ఫీజులను భరించలేని నేపథ్యాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కుష్వంత్‌ పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి రూ.5 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, భూపాలపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గండ్ర జ్యోతి సమక్షంలో సీఎం సహాయ నిధి ద్వారా వచ్చిన రూ.5లక్షల చెక్కును కేటీఆర్‌ కుష్వంత్‌కు అందించారు.

మరో ఇద్దరికి...

మరో ఇద్దరు విద్యార్థులకు ఆయన సొంతంగా డబ్బులు అందజేశారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పోటీ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన లావణ్య, సిరిసిల్ల జిల్లా సుందరయ్య నగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి పవన్​కు కేటీఆర్‌ ఆర్థికంగా సహాయం అందించారు.

కేటీఆర్​ ఆర్థిక సహాయం

ఇవీ చూడండి: టోల్​గేట్​ రుసుం రద్దు చేయాలని హైకోర్టులో వ్యాజ్యం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.