మంత్రి కేటీఆర్.. తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన 6 కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను ప్రభుత్వానికి అందించారు. ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు ఇప్పటికే అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటిని కూడా ప్రారంభిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు... కేటీఆర్‌కు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇవి కోవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేయనున్నాయి.