ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాల తెరాస నేతలను అభినందించిన కేటీఆర్‌

Ktr Tweet: రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు అండగా ఉంటూన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కష్టకాలంలో ప్రజలతో కలిసి బాధిత ప్రాంతాలో పర్యటిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా వారికి అభినందలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

కేటీఆర్​
కేటీఆర్​
author img

By

Published : Jul 15, 2022, 1:23 PM IST

Ktr Tweet: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా ఉంటూ.. వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందించారు. కష్టకాలంలో ప్రజలతో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారని తెలిపారు. ప్రజలకు తెరాస నేతలు అన్ని రకాల సహాయం అందిస్తున్నారని చెప్పారు. ప్రజల కష్టాల్లో అండగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరుణుడు కాస్త బ్రేక్​ తీసుకున్నాడు. సుమారు వారం రోజులుగా ఎడతెరపిలేకుండా.. తన ప్రతాపాన్ని చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాడు. ఇప్పుడు కాస్త శాంతించినా.. మళ్లీ 18 తర్వాత విజృంభించేందుకు అవకాశమున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి: కాళేశ్వరానికి రికార్డు స్థాయిలో వరద.. మేడిగడ్డ, అన్నారం గేట్లు ఎత్తివేత

గంగానది దాటేందుకు యత్నం.. వరదలో కొట్టుకుపోయిన యువకుడు.. ఆఖరి క్షణంలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.