తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరవలేనిదని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఆర్.ఎం.రావు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్నత పదవిని త్యజించిన త్యాగశీలి బాపూజీ అని కమిషనర్ కొనియాడారు. ఎందరికో స్ఫూర్తివంతమైన ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముందని తెలిపారు.
ఇదీచూడండి: కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మంత్రి కొప్పుల