హైదరాబాద్ గాంధీభవన్‌లో ఈరోజు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ ఠాక్రే ‘హాథ్ సే హాథ్’ కార్యక్రమంపై పార్టీ నేతలతో చర్చించేందుకు గాంధీభవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రేను కలిసేందుకు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి .. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాసేపు వీరిద్దరూ సీరియస్‌గా చర్చించుకోవడం.. కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపింది.
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత .. టీపీసీసీ, కోమటిరెడ్డి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకోవడంతో పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతలూ ఏం మాట్లాడుకున్నారా? అని మీడియాతో పాటు, పార్టీ నేతలు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
తానెప్పుడూ గాంధీ భవన్‌కు రానని చెప్పలేదు: అంతకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాణిక్‌రావు ఠాక్రే తనకు ఫోన్ చేశారని చెప్పారు. అందుకే ఆయనతో భేటీ అయ్యేందుకు వచ్చానని తెలిపారు. తన నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇటీవల రాలేకపోయానని వివరించారు. తానెప్పుడూ గాంధీ భవన్‌కు రానని చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తేవాలో భేటీలో చెబుతానని వివరించారు.
భవిష్యత్‌లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన ధ్యేయం: భవిష్యత్‌లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన ధ్యేయమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సీనియర్ నేతగా తనకున్న అనుభవంతో అధినాయకత్వానికి.. తన నుంచి సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో అణగారిపోతున్న పార్టీ కార్యకర్తలలో బలం నింపి.. తిరిగి కాంగ్రెస్‌కు పునర్వైభవం సాధిస్తామని వివరించారు. ఖమ్మం లాంటి సభలు కాంగ్రెస్ వందల్లో పెట్టిందని గుర్తు చేశారు. ఎన్ని సభలు పెట్టినా కేసీఆర్ ఏం చేయలేరని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
గాంధీ భవన్ నుంచి అలిగి వెళ్లిపోయిన వీహెచ్: కాంగ్రెస్ సీనియర్‌నేత వి.హనుమంతరావు గాంధీ భవన్ నుంచి అలిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ క్రికెట్ టోర్నీకి ఠాక్రేను వీహెచ్ ఆహ్వానించారు. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాలేకపోతున్నట్టు ఠాక్రే తెలిపారు. ఠాక్రే.. వీహెచ్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ జోక్యం చేసుకున్నారు. దీంతో వీహెచ్, మహేశ్‌కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమంతరావు గాంధీ భవన్ నుంచి అలిగి వెళ్లిపోయారు.
"రాష్ట్రంలో అణగారిపోతున్న పార్టీ కార్యకర్తలలో బలం నింపి తిరిగి కాంగ్రెస్‌కు పునర్వైభవం సాధిస్తాం. అధినాయకత్వానికి.. తన నుంచి సలహాలు, సూచనలు అందిస్తాను. భవిష్యత్‌లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన ధ్యేయం." - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ
ఇవీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను అవమానిస్తోంది: రేవంత్‌రెడ్డి
అంబానీ సంపద రూ.7లక్షల కోట్లు.. కాబోయే కోడలు ఫ్యామిలీ ఆస్తి ఎంతంటే..