ETV Bharat / state

పీజీ మెడికల్​ కన్వీనర్​ కోటా మూడో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్​ - హైదరాబాద్​ తాజా వార్తలు

పీజీ మెడికల్‌ కన్వీనర్ కోటా మూడో విడత ప్రవేశాల సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవాళ, రేపు వెబ్‌ఆప్షన్లు నిర్వహించనున్నట్టు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రకటనలో తెలిపారు.

coloji narayanarao medical university
పీజీ మెడికల్​ కన్వీనర్​ కోటా మూడో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్​
author img

By

Published : Jul 5, 2020, 6:55 AM IST

పీజీ మెడికల్‌ కన్వీనర్ కోటా మూడో విడత ప్రవేశాల సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవాళ, రేపు వెబ్‌ఆప్షన్లు నిర్వహించనున్నట్టు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రకటనలో తెలిపారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు, నిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నామని తెలిపారు. తుది మెరిట్‌ జాబితాలో అర్హులైన అభ్యర్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌లో హాజరు కావాలని సూచించారు. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచారు.

ఆల్ ఇండియా కోటాలో మిగిలిన సీట్లను సైతం ఈ విడతలో భర్తీ చేయనున్నామని తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇది వరకే సీటు పొంది కళాశాలల్లో చేరిన విద్యార్థులు తమ కోర్సు, కళాశాల మార్చుకోవాలనుకుంటే అట్టి విద్యార్థులు సైతం వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.