ఈ నెల 30నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ఆనందనిలయం, బంగారువాకిలి, పడికావళి... మందిరంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర వస్తువులను అర్చకులు, తితిదే సిబ్బంది శుభ్రం చేశారు.
శుద్ధి తరువాత... నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచీలీగడ్డ తదితర సుగంధం ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయంతటా సంప్రోక్షణం చేస్తున్నారు. ఆలయ శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నారు. అప్పటివరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేశారు.